మక్కా, మదీనాల్లో కర్ఫ్యూ విధించిన సౌదీ అరేబియా

Saudi Arabia decides to impose curfew in Mecca and Madina
  • సౌదీలో కరోనా బారిన పడి 20 మందికి పైగా మరణం
  • మక్కా, మదీనాల్లో 24 గంటల కర్ఫ్యూ విధింపు
  • ఇప్పటికే రద్దైన అంతర్జాతీయ విమాన సర్వీసులు
కరోనా మహమ్మారి ప్రపంచంలోని అన్ని దేశాలపైనా పంజా విసురుతోంది. ముస్లింలకు అత్యంత ప్రధానమైన సౌదీ అరేబియా కూడా ఈ మహమ్మారి దెబ్బకు వణికిపోతోంది. ఈ క్రమంలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాలైన మక్కా, మదీనాలో 24 గంటల పాటు కర్ఫ్యూ విధించింది.

అంతేకాదు, ఈ ప్రాంతాల్లో తిరిగే కార్లలో కేవలం ఒక వ్యక్తి మాత్రమే ప్రయాణించాలని ఆదేశించింది. సౌదీలో ఇప్పటి వరకు దాదాపు 2 వేల మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 20 మందికి పైగా మరణించారు. దీంతో, కరోనాను కట్టడి చేసేందుకు ఆ దేశం లాక్ డౌన్ విధించింది. అంతర్జాతీయ విమాన సేవలను రద్దు చేసింది. ఇతర దేశాల ప్రజలు మక్కా, మదీనా కోసం ఎలాంటి బుకింగ్స్ చేసుకోవద్దని ఇప్పటికే విన్నవించింది.
Go Back to Shorts
Saudi Arabia
Mecca
Madina
Corona Virus
Curfew

More Telugu News