Corona Virus: కరోనా అలర్ట్: ఏపీలో కొత్తగా మరో 3 కేసులు

Three more corona positive cases in AP
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత ఉద్ధృతమవుతోంది. తాజాగా మరో 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 135కి చేరింది. కరోనా బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో గుంటూరు, కడపలో కూడా కరోనా నిర్ధారణ ల్యాబ్ లు ఏర్పాటు చేశారు. గుంటూరులోని కరోనా పరీక్షల కేంద్రం రేపటి నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుండగా, కడపలోని ల్యాబ్ ఎల్లుండి నుంచి పని ప్రారంభించనుంది. రాష్ట్రంలో ఇప్పటికే నాలుగు ప్రాంతాల్లో కరోనా టెస్టింగ్ ల్యాబ్ లు ఉన్నాయి.
Go Back to Shorts
Corona Virus
Andhra Pradesh
Positive
Guntur
Kadapa
Corona Lab

More Telugu News