ఏపీలో మరో 21 మందికి కరోనా.. ప్రకాశం, నెల్లూరులో అత్యధికంగా 20 మంది చొప్పున బాధితులు

coronavirus cases in ap
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి. నిన్న రాత్రి 10 గంటల నుంచి ఈ రోజు ఉదయం 10 గంటల వరకు మొత్తం 21 కొత్త కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 132కు చేరింది. ఏపీలో ప్రతి రోజు పెద్ద మొత్తంలో కరోనా కేసులు నిర్ధారణ అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌లో పాల్గొని వచ్చిన వారే కరోనా బాధితుల్లో అధికంగా ఉన్నారు. అక్కడ జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్న వారందరినీ పరీక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఏపీలో ఇంకా వందలాది మందికి చేసిన కరోనా పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. అత్యధికంగా గుంటూరులో 20, నెల్లూరులోనూ 20 కేసులు నమోదయ్యాయి.    

ఏ జిల్లాలో ఎంతమంది కరోనా బాధితులు?
                    
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus

More Telugu News