Somireddy Chandra Mohan Reddy: ప్రళయం లాంటి కరోనాతో జీవితంలో ఊహించని అనుభవాలు ఎదురవుతున్నాయి: సోమిరెడ్డి

  • ట్విట్టర్‌లో వీడియో పోస్ట్ చేసిన సోమిరెడ్డి చంద్ర మోహన్‌ రెడ్డి
  • ధనికులు, పేదలు ఒక్కటే అని అనుభవపూర్వకంగా చూపుతోంది
  • జీవితాలను పణంగా పెట్టి సేవలందిస్తున్న వారికి రుణపడివుండాల్సిందే
somireddy on corona

కరోనా వల్ల ఎన్నడూ చూడని ఘటనలు చూస్తున్నామంటూ టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు. కరోనా విజృంభణ వల్ల చోటు చేసుకుంటున్న పరిణామాలపై తన ట్విట్టర్‌ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు.

'ప్రళయం లాంటి కరోనాతో జీవితంలో ఊహించని అనుభవాలు ఎదురవుతున్నాయి. ధనికులు, పేదలు ఒక్కటే అని అనుభవపూర్వకంగా చూపుతోంది. మరోవైపు ఈ విపత్కర పరిస్థితుల్లో జీవితాలను పణంగా పెట్టి సేవలందిస్తున్న వారికి జీవితాంతం రుణపడివుండాల్సిందే' అని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.

More Telugu News