అలాగైతే ఏపీలో కరోనా నియంత్రణ గతి తప్పే ప్రమాదం: విజయసాయిరెడ్డి
- పొరుగు రాష్ట్రాల్లో వున్న ఏపీ ప్రజలు ఏప్రిల్ 14 వరకు అక్కడే ఉండాలి
- కేసీఆర్ గారితో జగన్ గారు మాట్లాడారు
- అక్కడ వారికి ఏ కొరత రాకుండా చూసుకుంటామని హామీ వచ్చింది
- బయటి నుంచి పౌరులు వస్తే మంచిదికాదు
'పొరుగు రాష్ట్రాలలో వున్న ఏపీ ప్రజలు ఏప్రిల్ 14 వరకు అక్కడే ఉండాలి. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ గారితో జగన్ గారు మాట్లాడారు. అక్కడ వారికి ఏ కొరత రాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చి కేసీఆర్ గారు పెద్ద మనసును చాటుకున్నారు. బయటి నుంచి పౌరులు వస్తే నియంత్రణ చర్యలు గతి తప్పే ప్రమాదం ఉంది' అని విజయసాయిరెడ్డి చెప్పారు.