Kerala: ఆల్కహాల్ వాసన రావడంతో శానిటైజర్ ను తాగేసిన ఖైదీ.. మృతి!

Kerala Jail Inmate Died after drink Sanitiser
షార్ట్స్‌లో చూడండి
జైల్లోని ఖైదీలకు కరోనా సోకకుండా తీసుకుంటున్న జాగ్రత్తల్లో భాగంగా శానిటైజర్ లను అందుబాటులో ఉంచగా, మందు వాసన రావడంతో, దాన్ని ఆబగా తాగేసిన ఓ రిమాండ్ ఖైదీ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కేరళలోని పాలక్కాడ్ లో జరిగింది. రామన్ కుట్టీ అనే ఓ ఖైదీ, శానిటైజర్ ను తాగి అపస్మారక స్థితికి వెళ్లడంతో, ఆసుపత్రికి తరలించారు.

కాగా, ఈ శానిటైజర్ ను ప్రభుత్వ ఆదేశానుసారం జైలులోనే ఖైదీలు తయారు చేసినట్టు ఓ అధికారి వెల్లడించారు. మంగళవారం రాత్రి వరకూ బాగానే ఉన్న అతను, బుధవారం జైలు గదిలోనే కుప్ప కూలాడని, ఆపై హాస్పిటల్ కు తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడని తెలిపారు. ఈ విషయంలో కేసు నమోదు చేసి విచారణ జరిపిస్తున్నామని వెల్లడించారు.
Go Back to Shorts
Kerala
Jail
Inmate
Sanitiser
Liquor
Alchohal

More Telugu News