తెలుగు రాష్ట్రాలకు రూ.5 లక్షల చొప్పున విరాళం ప్రకటించిన పీవీ సింధు

PV Sindhu donates to Telugu states
  • దేశంలో లాక్ డౌన్
  • కరోనాపై తీవ్రంగా పోరాడుతున్న తెలుగు రాష్ట్రాలు
  • విరాళం ఇస్తున్నట్టు ట్వీట్ చేసిన సింధు
కరోనాపై భారత్ ఆదిలోనే తీవ్రస్థాయి పోరాటం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించడంతో దేశం స్థంభించిపోయింది. ఈ క్రమంలో కరోనాపై పోరుకు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా బ్యాడ్మింటన్ ధృవతార పీవీ సింధు తెలుగు రాష్ట్రాలకు రూ.5 లక్షల చొప్పున విరాళం ప్రకటించింది. "కొవిడ్-19పై సమరంలో తలమునకలై ఉన్న తెలుగు రాష్ట్రాలకు చేయూతగా నిలుద్దామని నిర్ణయించుకున్నాను. అందుకే తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్, ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ పండ్ కు విరాళం ప్రకటిస్తున్నా" అంటూ సింధు ట్విట్టర్ లో వెల్లడించింది.
Go Back to Shorts
PV Sindhu
Andhra Pradesh
Telangana
Corona Virus
Donation
CM Relief Fund

More Telugu News