Bhumi Pednekar: 'భాగమతి' రీమేక్ .. హిందీలో 'దుర్గావతి'

  • తెలుగులో విజయవంతమైన 'భాగమతి'
  • హిందీ రీమేక్ గా 'దుర్గావతి'
  • ఈ సినిమాపైన భూమి పెడ్నేకర్ నమ్మకం
Durgavathi Movie

అనుష్క ప్రధాన పాత్రధారిగా రూపొందిన 'భాగమతి' ఆమె కెరియర్లోనే ప్రత్యేకమైనదిగా నిలిచింది. జి.అశోక్ దర్శకత్వం వహించిన ఈ హారర్ థ్రిల్లర్, ఇక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి అశోక్ రంగంలోకి దిగాడు. అనుష్క పాత్ర కోసం హిందీలో భూమి పెడ్నేకర్ ను ఎంపిక చేసుకున్నారు.

హిందీలో ఈ సినిమాకి 'దుర్గావతి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాను విక్రమ్ మల్హోత్ర నిర్మిస్తుండగా, అక్షయ్ కుమార్ కూడా ఓ నిర్మాణ భాగస్వామిగా వున్నాడు. 'భాగమతి'కి అనుష్క లుక్  .. ఆమె నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనుష్క అసమానమైన నటనకి ఈ సినిమా అద్దం పట్టింది. కథ తన పాత్ర చుట్టూనే తిరగడం వలన .. నటనకి అవకాశం ఉండటం వలన ఈ సినిమా తన కెరియర్ కి హెల్ప్ అవుతుందని భూమి పెడ్నేకర్ భావిస్తోంది.

More Telugu News