Allu Arjun: 'రేసు గుర్రం' దర్శకుడితో బన్నీ?

  • ఈ మధ్య 'సైరా' చేసిన సురేందర్ రెడ్డి 
  • గతంలో బన్నీతో చేసిన 'రేసు గుర్రం'
  • మరో సినిమా కోసం ప్రయత్నాలు
Resu Gurram Movie

యాక్షన్ కి .. ఎమోషన్ కి ప్రాధాన్యతనిస్తూ, స్టైలిష్ మేకింగ్ తో ఆకట్టుకునే దర్శకుల జాబితాలో సురేందర్ రెడ్డి కూడా కనిపిస్తాడు. ఆయన నుంచి వచ్చిన 'సైరా' దర్శకుడిగా ఆయన సత్తాను మరోసారి చాటిచెప్పింది. ఆ సినిమా తరువాత ఆయన యువ కథానాయకుల కోసం కథలను సిద్ధం చేస్తూ వచ్చాడు. అలా బన్నీ కోసం కూడా ఒక కథను తయారు చేసిన సురేందర్ రెడ్డి, ఇటీవలే ఆయనను కలిసి వినిపించాడట.

అయితే సుకుమార్ సినిమాపై దృష్టిపెట్టిన ఆయన, ఇంకా ఏ విషయమూ చెప్పలేదట. గతంలో బన్నీ - సురేందర్ రెడ్డి కాంబినేషన్లో 'రేసు గుర్రం' వంటి సూపర్ హిట్ సినిమా వచ్చింది. బన్నీ స్టార్ డమ్ ను మరో మెట్టుపైకి ఈ సినిమా తీసుకెళ్లింది. 2014లో వచ్చిన సినిమాల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పటి నుంచి సురేందర్ రెడ్డి - బన్నీ మధ్య మంచి సాన్నిహిత్యం వుంది. అందువలన సురేందర్ రెడ్డికి బన్నీ గ్రీన్  సిగ్నల్ ఇవ్వడం ఖాయమేనని అంటున్నారు.

More Telugu News