కరోనా ఎఫెక్ట్... స్థానిక సంస్థల నిధులు విడుదల చేసిన కేంద్రం
- ఆరు రాష్ట్రాలకు స్థానిక నిధులు
- రూ.2,570 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- ఏపీకి రెండు విడతల నిధుల విడుదల
ఏపీ, తమిళనాడు, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాలకు ఈ నిధులు విడుదల చేశారు. పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు నిధులు ఇస్తున్నామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఏపీకి 2018-19 ఏడాదికి గాను రెండో విడత నిధుల కింద రూ.870.23 కోట్లు విడుదల చేశారు. అంతేకాదు, ఏపీకి 2019-20 ఏడాది మొదటి విడత నిధుల కింద రూ.431 కోట్లు విడుదల చేశారు. మొత్తం ఆరు రాష్ట్రాలకు కేంద్రం రూ.2,570 కోట్లు విడుదల చేసింది.