యూపీ సర్కారు సంచలన నిర్ణయం... ఈ ఏడు పరీక్షలు లేకుండానే అందరూ పాస్!
- ఇప్పటికే పాఠశాలలకు సెలవులు
- పరీక్షలు నిర్వహించరాదని ప్రభుత్వం నిర్ణయం
- ఈ ఏటికి అందరూ పాసైపోయినట్టు ఉత్తర్వులు
వాస్తవానికి యూపీలో మార్చి 23 నుంచి 28 వరకూ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాల్సి వుంది. "విద్యార్థులందరినీ ప్రమోట్ చేయాలని ఆదేశాలు జారీ చేశాము. ఒకటి నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. అన్ని పాఠశాలలూ ఏప్రిల్ 2 వరకూ మూసివేయబడి వుంటాయి. తదుపరి పరిస్థితిని బట్టి సమీక్ష జరిపి నిర్ణయాలు తీసుకుంటాం" అని ఆయన అన్నారు. మిగతా బోర్డు పరీక్షలు ఎప్పుడు జరపాలన్న విషయమై ఏప్రిల్ 2 తరువాత నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.