'రొమాంటిక్' టైటిల్ కి మించి వుంటుందట
అయితే టైటిల్ కి మించి ఈ సినిమాలో రొమాన్స్ వుంటుందని తెలుస్తోంది. ఈ ప్రేమకథలో సందర్భానికి తగినట్టుగా దర్శకుడు రొమాన్స్ పాళ్లను పెంచుతూ వెళ్లాడని అంటున్నారు. క్లైమాక్స్ సీన్ కూడా హీరో హీరోయిన్ల లిప్ టు లిప్ కిస్ తో ముగుస్తుందని అంటున్నారు. ఘాటైన ముద్దుతో కథను ముగిస్తూ కథకు న్యాయం చేసినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ .. మందిరా బేడీ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.