దేశంలో 129కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు.. నిన్న ఒక్కరోజే 19 కరోనా కేసులు
- కర్ణాటకలో మొత్తం 10 మందికి కరోనా
- యూకే నుంచి వచ్చిన 20 ఏళ్ల యువతికి కరోనా పాజిటివ్
- ప్రపంచ వ్యాప్తంగా 1,82,547 కేసులు
- ప్రపంచ వ్యాప్తంగా 7,164 మంది మృతి
చైనాలో పుట్టుకొచ్చిన కరోనా కొవిడ్-19 వైరస్ ఇప్పటివరకు 162 దేశాలకు విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా 1,82,547 కేసులు నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా కారణంగా 7,164 మంది మృతి చెందారు. చైనాలో 3,226, ఇటలీలో 2,158, స్పెయిన్‌లో 342 మంది ప్రాణాలు కోల్పోయారు.