మూడు రాజధానుల అంశంపై.. టీడీపీ ఎంపీ కనకమేడల లేఖకు ప్రధాని జవాబు!
- ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనను అడ్డుకోవాలంటూ లేఖ
- శాసనమండలి రద్దు అంశం కూడా ప్రస్తావన
- అడ్డుకోకుంటే దేశ సమగ్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆవేదన
విభజన చట్టం ప్రకారం రాజధానిగా అమరావతి ఇప్పటికే ఖరారైందన్నారు. తన పరిధిలో లేని అంశంపై జోక్యం చేసుకుంటున్న ఏపీ ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని, లేదంటే మొత్తం దేశంపైనే దుష్ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే, శాసనమండలి రద్దు అంశాన్ని కూడా కనకమేడల ప్రస్తావించారు. కనకమేడల రాసిన లేఖకు ప్రధాని స్పందించారు. ‘‘ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై మీరు రాసిన లేఖ నాకు అందింది’’ అని కనకమేడలకు మోదీ లేఖ రాశారు.