Kesineni Swetha: ఇది రాష్ట్రమా? కులకార్చిచ్చుతో రగులుతున్న రణరంగమా?: జగన్‌పై కేశినేని శ్వేత ఆగ్రహం

kesineni swetha on local body elections
  • స్థానిక ఎన్నికల్లో జగన్‌ ఓటమి భయం
  • కేంద్ర మిత్రుల సహకారంతో ఆదేశాలు జారీ చేయించుకున్నారు
  • ఇక్కడ స్వరం మార్చారు
  • ఈసీ ఆదేశాలతో పనిచేసే ముఖ్య అధికారిని విమర్శించడం సరికాదు
ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ నాయకురాలు కేశినేని శ్వేత విమర్శలు గుప్పించారు. 'స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతో, మీ కేంద్ర మిత్రుల సహకారంతో ఆదేశాలు జారీ చేయించుకుని, ఇక్కడ స్వరం మార్చి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో పనిచేసే ముఖ్య అధికారిని విమర్శించడం సరికాదు' అని జగన్‌ను విమర్శించారు.

'ఇది రాష్ట్రమా? కులకార్చిచ్చుతో రగులుతున్న  రణరంగమా?' అని ఆమె ప్రశ్నించారు. కాగా, ఇటీవలే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన టీడీపీ ఎంపీ కేశినేని కుమార్తె శ్వేత.. స్థానిక ఎన్నికల్లో విజయవాడ కార్పొరేషన్ 11వ డివిజన్‌ నుంచి బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఆమెను విజయవాడ మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. 
Kesineni Swetha
Telugudesam
Andhra Pradesh
Local Body Polls

More Telugu News