Allu Arjun: బన్నీ మూవీలో విజయ్ సేతుపతి చేయడం లేదట

Sukumar Movie
షార్ట్స్‌లో చూడండి
తమిళనాట ఇప్పుడు విజయ్ సేతుపతికి వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒక వైపున తమిళంలో వైవిధ్యభరితమైన కథానాయకుడిగా మంచి మార్కులు సంపాదించుకుంటూనే, మరో వైపున ఆయన తెలుగులో కీలకంగా నిలిచే విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన 'ఉప్పెన' సినిమాలో ప్రతినాయకుడి పాత్రను పోషించాడు.

ఆ తరువాత ఆయన బన్నీ కథానాయకుడిగా చేస్తున్న సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రను చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఫారెస్ట్ నేపథ్యంలో సాగే ఈ కథలో ఫారెస్ట్ ఆఫీసర్ పాత్ర కోసం విజయ్ సేతుపతిని తీసుకున్నట్టుగా ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంలో నిజం లేదనేది తాజా సమాచారం. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, మిగతా నటీనటుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
Go Back to Shorts
Allu Arjun
Rashmika
Vijay Sethupathi
Sukumar Movie

More Telugu News