Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలి: చంద్రబాబునాయుడు

chandrababu demands Local elections should be conducted by deploying central forces
  • కేంద్ర బలగాలను మోహరించి ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించాలి
  • ప్రజలను బెదిరించి ‘ఏకగ్రీవం’ చేసుకుంటే గౌరవించాలా?
  • రాజ్యాంగానికి జగన్ అతీతుడేమీ కాదు
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. ప్రజలను బెదిరించి ‘ఏకగ్రీవం’ చేసుకుంటే గౌరవించాలా? అని ప్రశ్నించారు. ఇప్పటి వరకూ జరిగిన ఏకగ్రీవాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి వైసీపీ శ్రేణుల అక్రమాలకు సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని అన్నారు. కేంద్ర బలగాలను మోహరించి ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

151 సీట్లు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసినంత మాత్రాన రాజ్యాంగ పరిధిలోకి రాకుండా పోరని, రాజ్యాంగానికి అతీతంగా జగన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. అందుకే, అంబేద్కర్ ఒక మాట అంటారు.. రాజ్యాంగం ఎంత  మంచిదైనా దానిని అమలు చేసే వ్యక్తి మంచివాడైతే ‘మంచి’ జరుగుతుందని, చెడ్డవాడైతే ‘చెడు’ జరుగుతుందని అన్నారని, ఇప్పుడు, ‘చెడే’ జరుగుతోందని, ఆ విషయం జగన్ నిరూపించే పరిస్థితికి వచ్చారంటూ విరుచుకుపడ్డారు.
Chandrababu
Telugudesam
Jagan
YSRCP
Local Body Polls

More Telugu News