అయినా ఈ దేవుళ్లకి కోపం ఎక్కువే: నాగబాబు
Add ap7am to your home Screen

అయినా ఈ దేవుళ్లకి కోపం ఎక్కువే: నాగబాబు

nagababu about religion and corona
  • ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా గురించి నాగబాబు వ్యాఖ్యలు
  • కొన్ని ప్రముఖ మతాల పెద్దల వ్యాఖ్యలపై సెటైర్‌
  • కరోనాను వాళ్ల దేవుడే భూమి మీదకి పంపించాడట అంటూ ట్వీట్
ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా జాతికి చెందిన కోవిడ్‌-19 వైరస్‌ గురించి సినీనటుడు, జనసేన నేత నాగబాబు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'కొన్ని ప్రముఖ మతాల పెద్దలు చెప్పిందేమంటే.. కరోనా వైరస్‌ని వాళ్ల దేవుడే ఈ భూమి మీదకి పంపించాడు అని అంటున్నారు. అయినా ఈ దేవుళ్లకి కోపం ఎక్కువే సుమా' అని ట్వీట్ చేశారు.

కాగా, కరోనా వైరస్‌ చైనాతో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మత పెద్దలు విచిత్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. 'మాంసాహారులను దండించడానికి దేవుడు ధరించిన కోపావతారమే కరోనా వైరస్' అని అఖిల భారత హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి ఇటీవలే వ్యాఖ్యానించారు.
nagababu
Janasena
Corona Virus

More Telugu News