కేంద్రంలోని బీజేపీ తెలంగాణకు ఇచ్చిందేమీ లేదు: సీఎం కేసీఆర్
- కాంగ్రెస్ పై విసుగుతోనే బీజేపీకి ఓటేశారన్న కేసీఆర్
- 50 ఏళ్ల సుదీర్ఘపోరాటం తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిందని వెల్లడి
- మోదీ సర్కారును నమ్మితే శంకరగిరి మాన్యాలే గతి అని వ్యాఖ్యలు
మోదీ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే గతి అని కేసీఆర్ స్పష్టం చేశారు. దేశాన్ని భ్రమింపజేసే పిచ్చి ప్రయత్నంలో కాంగ్రెస్ ఉండేదని, ఇప్పుడు బీజేపీ కూడా ఆ విధంగానే తయారైందని విమర్శించారు. శాసనసభలో బడ్జెట్ చర్చ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆ విధంగా అన్నారు.