2036 వరకూ రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఎదురులేనట్టే!
- 2024తో ముగియనున్న పుతిన్ పదవీకాలం
- మరో 12 ఏళ్లు అధికారంలో ఉండేలా రాజ్యాంగ సవరణ
- ఆమోదం తెలిపిన ఉభయసభలు
ఈ మేరకు 'ద స్టేట్ డ్యూమా' దేశ రాజ్యాంగ సవరణలకు ఏకగ్రీవ ఆమోదం పలికింది. ఈ సవరణలకు 383 అనుకూల ఓట్లు రాగా, వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడకపోవడం గమనార్హం. 43 మంది పార్లమెంట్ సభ్యులు హాజరు కాలేదు. కాగా, 'ద స్టేట్ డ్యూమా' ఈ సవరణలకు ఆమోదం పలికిన గంటల వ్యవధిలోనే ఎగువ సభ 'ఫెడరేషన్ కౌన్సిల్' ఆమోదం కూడా లభించింది.
ఇక ఏప్రిల్ 22న దేశవ్యాప్తంగా ఈ సవరణలపై ఓటింగ్ జరుగనుండగా, అది నామమాత్రమే. ఈలోగా రష్యా రాజ్యాంగ న్యాయస్థానం ఈ సవరణలను మరోసారి సమీక్షించనుంది. గడచిన రెండు దశాబ్దాలుగా పుతిన్ రష్యా రాజకీయాలను ఏలుతూ, తిరుగులేని స్థానంలో ఉన్నారన్న సంగతి విదితమే.