Nagarjuna: 'బంగార్రాజు' సినిమాలో సమంత

  • 'వైల్డ్ డాగ్' సినిమాతో బిజీగా నాగ్
  • త్వరలో షూటింగు పార్టు పూర్తి
  • 'బంగార్రాజు'తో సెట్స్ పైకి కల్యాణ్ కృష్ణ
Bangarraju Movie

ప్రస్తుతం నాగార్జున కథానాయకుడిగా 'వైల్డ్ డాగ్' రూపొందుతోంది. యాక్షన్ కి ప్రాధాన్యతనిస్తూ సాగుతున్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకుంది. ఈ సినిమా తరువాత ఆయన 'బంగార్రాజు' సినిమా కోసం సెట్స్ పైకి వెళ్లనున్నారు. గతంలో 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాతో నాగార్జునకి భారీ హిట్ ఇచ్చిన కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలోనే 'బంగార్రాజు' రూపొందనుంది.

ప్రస్తుతం స్క్రిప్ట్ ను ఫైనల్ చేసే పనిలో వున్నారు. ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. అలాగే ఓ ముఖ్యమైన పాత్రలో నాగచైతన్య కనిపించనున్నాడనే టాక్ వచ్చింది. ఆయన జోడీగా కొంతమంది కథానాయికల పేర్లు వినిపించాయి. ఆ పాత్రకిగాను సమంతను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రేజీ  కాంబినేషన్ తో ఈ ప్రాజెక్టుపై మరింతగా అంచనాలు పెరిగిపోవడం ఖాయంగా అనిపిస్తోంది.

More Telugu News