సద్గురు జగ్గీ వాసుదేవ్ తో డివిలియర్స్ ముచ్చట్లు

AB de Villiers talks with Sadguru ahead of IPL
  • ఈ నెల చివరి వారంలో ఐపీఎల్ ఆరంభం
  • భారత్ చేరుకున్న ఏబీ డివిలియర్స్
  • విజయం సాధించేందుకు ఏబీకి సూచనలు చేసిన సద్గురు
మరికొన్నిరోజుల్లో దేశంలో ఐపీఎల్ సందడి మొదలవనుంది. మార్చి 29న ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈ లీగ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడుతున్న దక్షిణాఫ్రికా వెటరన్ స్టార్ ఏబీ డివిలియర్స్ కొన్నిరోజుల కిందట భారత్ చేరుకున్నాడు. ఈ క్రమంలో డివిలియర్స్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ తో భేటీ అయ్యాడు. సద్గురుతో సంభాషించి మురిసిపోయాడు. డివిలియర్స్ అడిగిన సందేహాలకు సద్గురు ఎంతో ఓపిగ్గా బదులిచ్చారు.

దీనిపై డివిలియర్స్ స్పందిస్తూ, భారత్ లో ఓ అద్భుతమైన వ్యక్తితో మాట్లాడానని పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికా గురించి, ఆఫ్రికా ఖండం గురించి అమోఘమైన సందేశం ఇచ్చారంటూ కొనియాడాడు. విజయం సాధించాలంటే ఏం చేయాలో చెప్పినందుకు ధన్యవాదాలు అంటూ ఈ విధ్వంసక వీరుడు ట్వీట్ చేశాడు. అంతేకాదు తమ దేశం రావాలంటూ సద్గురుకు ఆహ్వానం పలకగా, ఆఫ్రికా వచ్చేందుకు తాను కూడా ఎదురుచూస్తున్నానని సద్గురు స్పందించారు.
Go Back to Shorts
Ab De Villiers
Sadguru
IPL
India
South Africa

More Telugu News