నిమిషాల వ్యవధిలోనే సింధియాను పార్టీ నుంచి బహిష్కరించిన కాంగ్రెస్
- మోదీని కలిసిన తర్వాత కాంగ్రెస్ కు రాజీనామా చేసిన సింధియా
- సింధియాపై బహిష్కరణ వేటు వేసిన కాంగ్రెస్
- పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న వేణుగోపాల్
ఈ ఉదయం ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో భేటీ అయిన వెంటనే కాంగ్రెస్ కు సింధియా రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సోనియాగాంధీకి పంపించారు. సింధియా నిర్ణయంతో మధ్యప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడిపోయింది.