Vijay Sai Reddy: కమాన్ చంద్రబాబు.. స్వాగతిస్తావో, పలాయనం చిత్తగిస్తావో: విజయసాయిరెడ్డి

vijaya sai reddy fires on chandra babu naidu
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో తీసుకొచ్చిన ఎన్నికల సంస్కరణలను దేశమంతా గమనిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే, దీన్ని చంద్రబాబు స్వాగతిస్తారా? లేక పారిపోతారా? అన్న విషయాన్ని ఆయనే తేల్చుకోవాలని అన్నారు.

'సీఎం జగన్ గారు అత్యంత సాహసంతో తీసుకొచ్చిన ఎన్నికల సంస్కరణలను దేశమంతా ఆసక్తిగా గమనిస్తోంది. ప్రలోభాలను తిరస్కరించి అసాధారణ పరిణతిని ప్రదర్శించేందుకు రాష్ట్ర ప్రజానీకం తహతహలాడుతోంది. కమాన్ చంద్రబాబూ. స్వాగతిస్తావో, పలాయనం చిత్తగిస్తావో తేల్చుకోవాల్సింది నువ్వే' అని ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Vijay Sai Reddy
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News