Dokka Manikya Vara prasad: సీఎం జగన్ అభివృద్ధి పనుల్లో భాగస్వామినవుతా: వైసీపీలో చేరిన డొక్కా
గుంటూరు జిల్లా నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో ఆయన చేరారు. జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా డొక్కాను జగన్ అభినందించారు. అనంతరం, మీడియాతో డొక్కా మాట్లాడుతూ, సీఎం జగన్ అభివృద్ధి పనుల్లో భాగస్వామిని అవుతానని, ఆ ఉద్దేశంతోనే పార్టీలో చేరానని చెప్పారు.
.
.