కశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల మృతి!
Add ap7am to your home Screen

కశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల మృతి!

Two Terrorists Killed In Encounter In Kashmir
  • షోపియాన్ జిల్లా రెబన్ ప్రాంతంలో ఘటన
  • ఉగ్రవాదులు ఉన్నట్టు అనుమానంతో సైన్యం కార్డన్ సెర్చ్
  • ఒకరికొకరు ఎదురుపడటంతో ఎన్ కౌంటర్
కశ్మీర్ లో సోమవారం ఉదయం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. దక్షిణ కశ్మీర్ లోని షోపియాన్ జిల్లా రెబన్ ప్రాంతంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో ఇద్దరు ఉగ్రవాదులు మరణించగా.. భద్రతా సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారు.

ఉగ్రవాదులున్నట్టు సమాచారంతో..

రెబన్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్టుగా భద్రతా బలగాలకు సోమవారం ఉదయం సమాచారం అందింది. దాంతో వెంటనే రంగంలోకి దిగిన సైన్యం, పోలీసులు.. ఆ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ మొదలుపెట్టారు. కొద్దిసేపటికే భద్రతా బలగాలను గుర్తించిన ఉగ్రవాదులు కాల్పులు మొదలుపెట్టారని.. దీంతో సైన్యం కూడా ఎదురు కాల్పులు జరిపిందని స్థానిక పోలీసులు తెలిపారు. కొంతసేపటి తర్వాత చూస్తే ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయి పడి ఉన్నారని గుర్తించామని చెప్పారు. భద్రతా బలగాల్లో ఎవరూ గాయపడలేదని తెలిపారు.
Jammu And Kashmir
Kashmir
Encounter

More Telugu News