Budda Venkanna: ఆకాశమే హద్దుగా ఎదుగుతున్న రాష్ట్రాన్ని నేల నాకించాడు: బుద్ధా వెంకన్న

budda venkanna criticises vijay sai reddy and jagan
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్ర విమర్శలు గుప్పించారు. 'ఆకాశమే హద్దుగా ఎదుగుతున్న రాష్ట్రాన్ని నేల నాకించి 10 నెలల్లో తుగ్లక్ పేరుని సార్ధకం చేసుకున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలను దెబ్బకొట్టి బీసీ ద్రోహిగా మిగిలిపోయాడు.
 
'స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతావ్ జగన్ రెడ్డి గారు? బీసీల రిజర్వేషన్లు 34 శాతం నుండి 24 శాతానికి తగ్గించాను అయినా ఓటు వెయ్యండి అని కాళ్లు పట్టుకుంటావా? మూడు ముక్కలాట మొదలెట్టి రాష్ట్రాన్ని నాశనం చేశాను క్షమించి ఓట్లు వెయ్యండి అని ప్రాధేయపడతావా?' అని విమర్శించారు.
 
'మద్యపాన నిషేధం పేరుతో ఇడుపులపాయలో తయారు అయ్యే చెత్త బ్రాండ్లను పోసి మీ పుస్తెలు తెంపుతున్నానని, అయినా అక్కా, చెల్లి సర్దుకుపోయి వైకాపాకి ఓటు వెయ్యమని దేహి అంటావా?' అని ప్రశ్నించారు.

'ముద్దుల యాత్ర లో చంద్రబాబు ఇన్సైడర్ ట్రేడింగ్, ఆరు లక్షల కోట్ల అవినీతి అని రెచ్చిపోయా రూపాయి కూడా అవినీతి జరిగినట్టు నిరూపించలేకపోయా మన్నించి ఈ సారికి గట్టెక్కించండి అని సాష్టాంగ నమస్కారం చేస్తావా?  లేక విజయసాయిరెడ్డి గారిని నడిరోడ్డు మీద నిలబెట్టి ఈ చెత్తపనులకు ఆద్యుడు అంటూ బలిస్తావా?' అని ట్వీట్లు చేశారు.
Go Back to Shorts
Budda Venkanna
Telugudesam
Jagan
YSRCP

More Telugu News