Tabu: పారితోషికంగా కోటి డిమాండ్ చేస్తున్న టబు?

  • స్టార్ హీరోయిన్ గా వెలిగిన టబు
  • ముఖ్యమైన పాత్రలతో బాలీవుడ్లో బిజీ
  • షాక్ అవుతున్న దర్శకనిర్మాతలు  
Ala vaikuntha Puramulo Movie

తెలుగులో 'నిన్నే పెళ్లాడుతా' .. 'కూలి నెం.1' వంటి హిట్స్ ఇచ్చిన 'టబు' .. హిందీలోనే వరుస సినిమాలతో దూసుకుపోయింది. ఈ మధ్య కాలంలో ఆమె హిందీలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తూ వెళుతోంది. ఇటీవల తెలుగులో ఆమె 'అల వైకుంఠపురములో' సినిమా చేసింది. ఈ సినిమాలో జయరామ్ భార్య పాత్రలో ఆమె కనిపించింది.

ఈ సినిమా విజయవంతం కావడంతో, దర్పంతో కూడిన శ్రీమంతురాలి పాత్రలకిగాను ముందుగా 'టబు' పేరునే దర్శక నిర్మాతలు పరిశీలిస్తున్నారట. ఈ తరహా పాత్రలకి ఆమె అయితేనే పూర్తి న్యాయం జరుగుతుందని భావించి సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే పారితోషికంగా ఆమె కోటి రూపాయలు అడుగుతోందట. అలా అయితేనే తనని కలవమని చెబుతోందట. దాంతో ఓ మాదిరి బడ్జెట్ అనుకున్న దర్శక నిర్మాతలు వేరే ఆర్టిస్టులను సంప్రదిస్తున్నారని తెలుస్తోంది.

More Telugu News