తాతయ్య అల్లు అరవింద్ బుగ్గలు లాగి, ముద్దు పెట్టుకున్న బన్నీ కూతురు అర్హ.. వీడియో ఇదిగో
- క్యూట్ వీడియో పోస్ట్ చేసిన నిఖిల్
- '18 పేజీస్' షూటింగ్ ప్రారంభం
- పూజా కార్యక్రమానికి వచ్చిన అల్లు అరవింద్, అర్హ
- 'ఆమె మా చీఫ్ గెఫ్ట్.. స్పెషల్ గెస్ట్' అన్న నిఖిల్
ఈ సందర్భంగా తన మనవరాలు (బన్నీ కూతురు) అర్హను కూడా అల్లు అరవింద్ తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 'నువ్వు నన్నేం చేస్తావో చూడాలని ఉందట.. ఒక్క సారి చూపించు వాళ్లకి' అని అల్లు అరవింద్ ఆమెను అడగ్గా, తన తాత బుగ్గలు లాగి ముద్దు పెట్టుకుంది.
ఈ వీడియోను పోస్ట్ చేసిన నిఖిల్.. 'ఆమె మా చీఫ్ గెఫ్ట్.. స్పెషల్ గెస్ట్' అని వ్యాఖ్యానించాడు. ఈ సినిమా అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 ఆర్ట్స్ పతాకంపై బన్నీవాస్ నిర్మాతగా రూపుదిద్దుకుంటుంది. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. '18 పేజీస్' టైటిల్ పోస్టర్‌ను నిఖిల్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.
గతంలో వచ్చిన 'కార్తికేయ'కు సీక్వెల్‌గా '18 పేజీస్' రూపుదిద్దుకుంటుంది.