అఖిల్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్
- సంగీత దర్శకుడిగా గోపీసుందర్
- ఆకట్టుకుంటున్న సిద్ శ్రీరామ్ ఆలాపన
- త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
"మనసా మనసా మనసారా బ్రతిమాలా .. తన వలలో పడబోకే మనసా .. " అంటూ ఈ సాంగ్ సాగుతోంది. గోపీసుందర్ సంగీతం .. సురేంద్ర కృష్ణ సాహిత్యం .. సిద్ శ్రీరామ్ ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన రొమాంటిక్ లవ్ స్టోరీగా 'బొమ్మరిల్లు' భాస్కర్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఇప్పటికే వరుస పరాజయాలతో వున్న అఖిల్ కి, ఈ సినిమా తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో అభిమానులు వున్నారు. వాళ్ల నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందేమో చూడాలి.