USA: యువతి పట్టుతప్పుతుంటే... చాకచక్యంగా క్యాచ్ చేసి కాపాడిన కోచ్... వైరల్ వీడియో ఇదిగో!

Koach Saves Young Gimnast
షార్ట్స్‌లో చూడండి
ఓ కోచ్ గా ఆటలో మెళకువలను నేర్పడమే కాకుండా, తన వద్ద శిక్షణ పొందుతున్న వారు ప్రమాదంలో పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం కూడా ముఖ్యమని, ఈ విషయంలో తాను తీసిపోనని నిరూపించాడో జిమ్నాస్ట్ కోచ్. తమ బిడ్డ ఫీట్స్ చేస్తుంటే, వీడియోలో చిత్రీకరిస్తున్న తల్లిదండ్రులు, బిడ్డ పడిపోతుంటే, ఒడుపుగా పట్టుకున్న కోచ్ వీడియోను సోషల్ మీడియాలో ఉంచారు. సుమారు 17 సెకన్ల పాటున్న ఈ వీడియోను అమెరికాలోని నష్విల్లెలో ఉన్న ఓ జిమ్నాస్ట్ శిక్షణ కేంద్రంలో తీశారు. ఆ యువతి పట్టుతప్పి పడిపోయి ఉంటే, రెండు కాళ్లూ విరిగే ప్రమాదముండేది. కానీ ఆమె పడకుండా కోచ్ పట్టుకున్నాడు. ఇప్పుడా కోచ్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Go Back to Shorts
USA
Gimnastics
Coach
Viral Videos

More Telugu News