వూహాన్‌లో చిక్కుకున్న కర్నూలు జ్యోతి ఢిల్లీకి చేరిక
- చైనా నుంచి వచ్చిన ప్రత్యేక విమానంలో చేరిక
- పదిహేను రోజులపాటు ఆమెకు వైద్య పరీక్షలు
- ఆ తర్వాత కర్నూలుకు పంపే అవకాశం
దీంతో ఆమెతోపాటు వెళ్లిన వారు వచ్చినా ఆమె రాకపోవడం, ఆమెకు పెళ్లి కూడా నిశ్చయం కావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. దీంతో జ్యోతిని స్వదేశానికి రప్పించేందుకు సాయపడాలంటూ కుటుంబ సభ్యులు రాజకీయ నాయకులు, ఎంబసీ అధికారులకు పలుమార్లు చేసిన విజ్ఞప్తుల మేరకు ఎట్టకేలకు వారి ఎదురు చూపు ఫలించింది. ఈ రోజు ఉదయం చైనా నుంచి వచ్చిన ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న జ్యోతిని అక్కడే పదిహేను రోజులపాటు ఉంచనున్నారు. అన్నిరకాల వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెకు కరోనా వైరస్ (కోవిడ్ 19) సోకలేదని నిర్ధారణ అయితే కర్నూలు పంపేందుకు అంగీకరిస్తారు.