టెస్టు ర్యాంకింగ్స్ లో కోహ్లీ అగ్రస్థానం పతనం... టాప్ టెన్ లోకి ప్రవేశించిన మయాంక్ అగర్వాల్
- కివీస్ తో తొలి టెస్టులో విఫలమైన కోహ్లీ
- రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 21 పరుగులు
- ఓ స్థానం పతనమై రెండో ర్యాంకులో నిలిచిన వైనం
టీమిండియాతో టెస్టులో రాణించిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మూడో స్థానానికి ఎగబాకాడు. ఆసీస్ సంచలనం మార్నస్ లబుషేన్ నాలుగో స్థానంలో నిలవగా, టీమిండియా యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ టాప్-10లో ప్రవేశించాడు. మయాంక్ 727 రేటింగ్ పాయింట్లతో పదో స్థానంలో ఉన్నాడు. అజింక్యా రహానే ఈ ర్యాంకింగ్స్ లో 8వ స్థానం దక్కించుకోగా, చటేశ్వర్ పుజారా రెండు స్థానాలు పతనమై 9వ ర్యాంకుకు పడిపోయాడు.