సుకుమార్ తోనే చిరంజీవి తదుపరి మూవీ?

Sukumar Movie
  • కొరటాల మూవీ షూటింగులో చిరూ 
  •  అందుబాటులో లేని త్రివిక్రమ్ 
  • సుకుమార్ కి ఛాన్స్ ఇచ్చిన చిరూ  
చిరంజీవి తాజా చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. వినోదానికి సందేశాన్ని జోడించి ఆయన ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. డిఫరెంట్ లుక్ తో చిరంజీవి కనిపించనున్న ఈ సినిమాను, ఆగస్టులో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఆ తరువాత సినిమాను సుకుమార్ దర్శకత్వంలో చేయాలనే నిర్ణయానికి చిరంజీవి వచ్చినట్టుగా సమాచారం.

కొరటాల సినిమా తరువాత త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయాలని చిరంజీవి అనుకున్నారు. అయితే కొరటాల సినిమా పూర్తయ్యేవరకూ వేచి ఉండటం వలన చాలా సమయం వృథా అవుతుందనే ఉద్దేశంతో, ఎన్టీఆర్ తో సెట్స్ పైకి వెళ్లడానికి త్రివిక్రమ్ సిద్ధమైపోయాడు. దాంతో తన తదుపరి సినిమాను సుకుమార్ తో చేయాలని చిరంజీవి భావించారు. ఈ విషయంపై చిరంజీవి - సుకుమార్ మధ్య కథా చర్చలు కూడా పూర్తయినట్టుగా తెలుస్తోంది. సుకుమార్ - చరణ్ కాంబినేషన్లోని 'రంగస్థలం' సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ వారే ఈ సినిమాకి కూడా నిర్మాతలుగా వ్యవహరించనున్నారని అంటున్నారు. కొరటాల సినిమాను చిరంజీవి పూర్తిచేసేలోగా, సుకుమార్ కూడా బన్నీ సినిమాను పూర్తిచేయవలసి ఉంటుంది. ఆ తరువాతే ఈ కొత్త ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది.
Go Back to Shorts
Chiranjeevi
Koratala Siva
Sukumar Movie

More Telugu News