అమెరికాలో భారత వ్యక్తి దారుణహత్య.. దొంగతనానికి వచ్చి కాల్చి చంపిన దుండగుడు
- బాధితుడిది హర్యానాలోని కర్నాల్
- లాస్ ఏంజెలెస్‌లోని ఓ స్టోర్‌లో ఉద్యోగం
- గత నెలలోనే ఇండియా వచ్చి వెళ్లిన వైనం
ఆ సమయంలో ఉన్న ఇద్దరు కస్టమర్లకు ఏ హానీ తలపెట్టని దుండగుడు మణిందర్‌పై మాత్రం కాల్పులు జరిపాడు. అనంతరం డబ్బులు తీసుకుని పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన మణిందర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గత నెలలో ఇండియాకు వచ్చిన మణిందర్.. అదే నెల చివరిలో తిరిగి అమెరికా చేరుకున్నాడు. అంతలోనే ఈ ఘోరం జరిగింది. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్టు మణిందర్ సోదరుడు తెలిపాడు.