సుకుమార్ సినిమాలో బన్నీ ద్విపాత్రాభినయం?
- లారీ డ్రైవర్ పాత్రలో అల్లు అర్జున్
- గుబురు గెడ్డంతో డిఫరెంట్ లుక్
- త్వరలోనే సెట్స్ పైకి
ఈ సినిమాలో అల్లు అర్జున్ మరో పాత్రను కూడా పోషించనున్నాడనేది తాజా సమాచారం. ఆ లుక్ కాస్త స్టైలీష్ గా .. మోడ్రన్ గా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా రష్మికను ఎంపిక చేసుకున్నారు. ఇప్పటికే సుకుమార్ 'రంగస్థలం'వంటి హిట్ ఇచ్చి వున్నాడు. ఇక అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో'తో సంచలన విజయాన్ని నమోదు చేసి వున్నాడు. మరో వైపున వరుస విజయాలతో రష్మిక దూసుకుపోతోంది. ఈ ముగ్గురి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు బాగానే వున్నాయి.