మహిళల టి20 వరల్డ్ కప్: ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో టాస్ ఓడిన టీమిండియా
- ఆస్ట్రేలియాలో మహిళల టి20 వరల్డ్ కప్ ఆరంభం
- తొలి మ్యాచ్ లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా
- టీమిండియాకు మొదట బ్యాటింగ్
- అదిరిపోయే ఆరంభాన్నిచ్చిన ఓపెనర్లు
- వెంటవెంటనే 3 వికెట్లు కోల్పోయిన వైనం
తొలి వికెట్ కు షెఫాలీ వర్మ (15 బంతుల్లో 29 రన్స్), స్మృతి మంధన (10) ఓవర్ కు పది రన్ రేట్ తో 41 పరుగులు జోడించారు. కానీ 6 పరుగుల తేడాతో భారత్ 3 వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (2) తీవ్రంగా నిరాశపర్చింది. ఎలిస్ పెర్రీ ఒక వికెట్, జొనాసెన్ 2 వికెట్ల తీసి భారత్ ను దెబ్బకొట్టారు. ప్రస్తుతం భారత్ స్కోరు 8 ఓవర్లలో 3 వికెట్లకు 51 పరుగులు కాగా, క్రీజులో జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ ఆడుతున్నారు.