Kishan Reddy: కేంద్ర నిధుల విషయంలో చర్చకు సిద్ధమా?: కేటీఆర్ కు కిషన్ రెడ్డి సవాల్

Kishan Reddy challenges TS minister KTR
షార్ట్స్‌లో చూడండి
కేంద్రం నుంచి తమకు భారీగా నిధులు రావాల్సి ఉందంటూ కొంతకాలంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. సీఎం కేసీఆర్ సహా మంత్రులు కూడా కేంద్రాన్ని ఈ విషయంలో బాహాటంగానే విమర్శిస్తున్నారు. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కేంద్ర ప్రభుత్వ నిధులపై చర్చకు సిద్ధమా? అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు. తెలంగాణకు నిధులు కేటాయించడంలో కేంద్రం ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తోందని కిషన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని స్పష్టం చేశారు.
Go Back to Shorts
Kishan Reddy
KTR
Funds
TRS

More Telugu News