భైంసాలో ఔరంగజేబు, శివాజీ పోరు సాగుతోంది: బీజీపీ ఎంపీ బండి సంజయ్
- భైంసాలో బాధిత కుటుంబాలకు బీజేపీ నేతల పరామర్శ
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో పర్యటన
- సీఎం కేసీఆర్ కు దమ్ముంటే భైంసాకు రావాలి
ఈ సందర్భంగా ఎంఐఎంపై నిప్పులు చెరిగారు. ఎంఐఎంను ‘అంతర్రాష్ట్ర దొంగలముఠా’గా అభివర్ణించారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, మళ్లీ అల్లర్లు పునరావృతమైతే అదే స్థాయిలో ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. భైంసాలో ఔరంగజేబు, శివాజీ మధ్య పోరు సాగుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంజయ్, ప్రాణ త్యాగాలకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.