Praveena: బస్ లో తనకు దొరికిన క్యాష్ బ్యాగ్ ను జాగ్రత్తగా యజమానికి చేర్చిన కండక్టర్ ప్రవీణ!

Conducter Praveena Returns Cash bag
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో దిల్ సుఖ్ నగర్ బస్ డిపోలో కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ, తనలోని నిజాయితీ, మానవత్వంతో ఇప్పుడు అందరి ప్రశంసలనూ అందుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే, నిన్న సికింద్రాబాద్ నుంచి సరూర్ నగర్ వెళుతున్న సిటీ బస్ లో ప్రవీణ విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఓ ప్రయాణికుడు, తాను దిగాల్సిన స్టేజ్ వచ్చిందన్న తొందరలో తన క్యాష్ బ్యాగ్ ను బస్సులోనే వదిలేసి దిగిపోయాడు.

ఆపై బస్సు గమ్యానికి చేరిన తరువాత ప్రవీణకు ఆ బ్యాగ్ కనిపించింది. తీసి చూడగా, అందులో రూ. 20 వేలకు పైగా నగదుంది. దీంతో ఆమె మలక్ పేట పోలీసులకు సమాచారం ఇచ్చి, వారి సాయంతో బాధితుడికి బ్యాగ్ ను చేర్చింది. పోయిందనుకున్న డబ్బులు వెతుక్కుంటూ వెనక్కు రావడంతో అతను ప్రవీణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రవీణ నిజాయితీని టీఎస్ ఆర్టీసీ అధికారులు, పోలీసులు అభినందించారు.
Go Back to Shorts
Praveena
Conductor
Cash Bag
Bus
TSRTC

More Telugu News