Antarkitika: మంచు ఖండంలో రికార్డు వేడి... శాస్త్రవేత్తల ఆందోళన!

Record Heat at Antarkitika
షార్ట్స్‌లో చూడండి
భువిపై అత్యంత చల్లటి ప్రదేశమైన అంటార్కిటికా ఖండంలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదుకావడం శాస్త్రవేత్తలను కలవరపెడుతోంది. అంటార్కిటికా ఉత్తరాగ్రంలో ఉన్న సైమోర్ ద్వీపంలో తొలిసారిగా 20.75 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఖండంలో గత రికార్డు 19 డిగ్రీల సెల్సియస్ కాగా, ఇప్పుడా రికార్డు బద్దలైంది. ఇక, వాతావరణ మార్పుల కారణంగానే వేడిమి పెరిగిందని చెప్పలేమని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరగడం ఆందోళన కలిగిస్తోందని, ఇక్కడి వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేస్తున్నామని వెల్లడించారు.
Go Back to Shorts
Antarkitika
Snlo
Heat
Record

More Telugu News