నా శరీరంలో మార్పులు చూసి.. ప్లాస్టిక్ సర్జరీ అనుకున్నారు: అవికా గోర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా శరీరంలో మార్పులు చూసి.. ప్లాస్టిక్ సర్జరీ అనుకున్నారు: అవికా గోర్

Avika Gor Clarifies Plastic Surgery Rumors and Body Transformation
  • అవికా ప్లాస్టిక్ సర్జరీలు, కాస్మోటిక్ ట్రీట్‌మెంట్లు చేయించుకుందని ప్రచారం
  • మొటిమలు తగ్గించుకోవడానికి చిన్న ట్రీట్‌మెంట్ చేయించుకున్నానన్న అవికా
  • అమ్మాయిలు పెరిగే కొద్దీ శరీరంలో మార్పులు సహజంగా వస్తాయని వ్యాఖ్య

ఇటీవలే ‘అగ్లీ స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కథానాయిక అవికా గోర్ ప్లాస్టిక్ సర్జరీలు, కాస్మోటిక్ ట్రీట్‌మెంట్లు చేయించుకుందంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ రూమర్లపై ఆమె స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చింది.


తమపై వస్తున్న సర్జరీ వదంతులను అవికా పూర్తిగా తోసిపుచ్చింది. "నేను ముఖంపై ఒక చిన్న ట్రీట్‌మెంట్ తీసుకున్న మాట వాస్తవమే. కానీ, అది అందం కోసం చేయించుకున్న సర్జరీ కాదు.. కేవలం నా ముఖంపై ఉన్న పింపుల్స్ (మొటిమలు) తగ్గించుకోవడానికి మాత్రమే. దురదృష్టవశాత్తూ అది కూడా సరిగా పనిచేయలేదు" అని వెల్లడించింది. నటిగా స్క్రీన్‌పై ప్రెజెంటబుల్‌గా కనిపించడం ముఖ్యం కాబట్టి, అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు పార్లర్‌కు వెళ్లి బ్లడ్ సెల్స్ క్లీనింగ్, బైఫిషియల్ లాంటి సాధారణ ఫేషియల్స్ చేయించుకునేదాన్ని తప్ప ఎలాంటి కాస్మోటిక్ సర్జరీలు చేయించుకోలేదని స్పష్టం చేసింది. 


"నాకు 7 ఏళ్ల వయసున్నప్పటి నుండే మేకప్ వేసుకోవడం అలవాటైంది. నా చర్మాన్ని కాపాడుకోవడానికి సన్‌స్క్రీన్ ఎక్కువగా వాడతాను. అసలు ఒక చిన్న టాటూ వేయించుకోవాలన్నా, కనీసం హెయిర్ కట్ చేయించుకోవాలన్నా మా అమ్మ పర్మిషన్ కావాలి.. అలాంటిది అంత పెద్ద సర్జరీలు నేను ఎలా చేయించుకోగలను?" అని అవికా ఎదురు ప్రశ్నించింది.


శరీరంలో వచ్చిన మార్పులు, ఫిట్‌నెస్ గురించి మాట్లాడుతూ.. "నా శరీరతత్వం ఏంటంటే.. చాలా త్వరగా బరువు పెరుగుతాను. అంతే వేగంగా బరువు తగ్గుతాను. వయసు పెరిగే కొద్దీ అమ్మాయిల శరీరంలో సహజంగానే మార్పులు వస్తాయి. కానీ, నన్ను చిన్నప్పటి నుండి చూస్తున్న జనాలు ఆ మార్పులను గమనించి ప్లాస్టిక్ సర్జరీ అనుకుని పొరబడ్డారు" అని చెప్పింది. ఇండస్ట్రీలో సమంత, రష్మిక మందన్నా, పూజా హెగ్డే వంటి స్టార్ హీరోయిన్లు తమ బాడీని ఎంత పర్‌ఫెక్ట్‌గా మెయింటైన్ చేస్తారో చూసి తాను ఎంతో ఇన్‌స్పైర్ అయ్యానని, వారిలాగే తాను కూడా జిమ్‌లో కఠినమైన వర్కవుట్స్ చేస్తూ సహజంగానే బరువు తగ్గానని అవికా గోర్ క్లారిటీ ఇచ్చింది.

Advertisement
Avika Gor
Chinnari Pellikuturu
Uyyala Jampala
plastic surgery rumors
cosmetic treatments
weight loss
fitness
Tollywood
Samantha
Rashmika Mandanna

More Telugu News