జపాన్ నౌకలో కరోనా కల్లోలం... తమను తీసుకెళ్లాలంటూ భారతీయుల ఆవేదన
- హాంకాంగ్ లో దిగిన ప్రయాణికుడికి కరోనా ఆనవాళ్లు
- యోకహామా రేవులో నిలిచిపోయిన డైమండ్ ప్రిన్సెస్ నౌక
- నౌకలో 3700 మందికి పైగా ప్రయాణికులు
- 130 మందికి పైగా ప్రయాణికులకు వైరస్ సోకినట్టు గుర్తింపు
ఈ నౌకలో తమ పరిస్థితి దారుణంగా ఉందని, ఇప్పటివరకు కరోనా పరీక్షలు కూడా చేయలేదని చెఫ్ గా పనిచేస్తున్న వినయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. డైమండ్ ప్రిన్సెస్ నౌకలో ఉన్న ఇతర భారతీయులతో కలిసి వినయ్ కుమార్ ఓ వీడియో సందేశం వెలువరించారు. తమను తీసుకెళ్లేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఐక్యరాజ్యసమితి స్పందించాలని విజ్ఞప్తి చేశారు. నౌకలో ఉన్న భారతీయులను వేరు చేసి, వీలైనంత త్వరగా తరలించాలని కోరారు.