7 లక్షల పెన్షన్లు ఎత్తేశారు: నారా లోకేశ్

  • మాట మార్చి, మడం తిప్పి పెన్షనర్లను మోసం చేశారు
  • పండుటాకులపై ఎందుకు అంత కక్ష?
  • మొండి ప్రభుత్వంపై టీడీపీ పోరాడుతుంది
రాష్ట్రంలోని అవ్వ, తాతలను  ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోసం చేశారంటూ టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా చేసిన మొదటి సంతకమే పెద్ద మాయ అని అన్నారు. మాట మార్చి, మడమ తిప్పి పెన్షనర్లను మోసం చేశారని విమర్శించారు. 'నేను ఉన్నాను, రూ. 3 వేల పెన్షన్ పక్కా' అని చెప్పిన జగన్... ఆ తర్వాత నేను వినలేదు, నేను లేను అంటూ కేవలం రూ. 250 పెన్షన్ పెంచి అవ్వ, తాతలను మోసం చేశారని అన్నారు. 60 ఏళ్లు దాటిన ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వకుండా రాక్షస రాజ్యాన్ని తలపిస్తున్నారని చెప్పారు. పండుటాకులపై జగన్ ఎందు అంత కక్షో అర్థం కావడం లేదని అన్నారు.

ఒకేసారి 7 లక్షల పెన్షన్లను ఎత్తేశారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు దివ్యాంగులకు కూడా పెన్షన్ తీసేయడానికి మీకు మనస్సు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఎత్తేసిన పెన్షన్లను తిరిగి ఇచ్చేంత వరకు అవ్వ, తాతలు, దివ్యాంగుల తరపున మొండి ప్రభుత్వంపై టీడీపీ పోరాడుతుందని అన్నారు.
Go Back to Shorts
Nara Lokesh
Telugudesam
Jagan
YSRCP
Pensions

More Telugu News