చట్టసభల కార్యకలాపాలు చూసి నేటితరం ఏం నేర్చుకోవాలి?: వెంకయ్యనాయుడు ఆవేదన
- చట్టసభల్లో నేతల తీరుపై వెంకయ్య అసహనం
- పార్లమెంటులో నేతలు వాడుతున్న భాష సిగ్గుచేటని వ్యాఖ్యలు
- అసెంబ్లీల్లోనూ అసభ్య పదజాలం కొనసాగుతోందని వెల్లడి
చట్టసభల్లో ప్రజాసమస్యలపై చర్చ జరగాలని, కానీ ఇప్పటి చట్టసభల కార్యకలాపాలు చూసి నేటితరం ఏం నేర్చుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో చదువుతో పాటు వినయం, సంస్కారం నేర్పాల్సిన అవసరం ఉందని, విద్యా వ్యవస్థలో గణనీయమైన మార్పు రావాలని అభిలషించారు. చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను గురువులు బోధించాలని సూచించారు. అంతేకాదు, సీఏఏ సహా ఇతర చట్టాలను దేశ ప్రజలంతా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.