రాజధానిపై కొంతమంది ప్రతిపక్ష నాయకుల వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి: బీజేపీ ఎంపీ జీవీఎల్
- రాజధాని విషయమై జోక్యం చేసుకోమని కేంద్రం చెప్పింది
- అయినా ప్రతిపక్ష నేతలు అమాయక వ్యాఖ్యలు చేస్తున్నారు
- కేంద్రం వ్యాఖ్యలను వక్రీకరించి మాట్లాడొద్దు
రాజధాని అంశం రాష్ట్రానికి సంబంధించిందని, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోలేదని అనేక సందర్భాల్లో తాను చెప్పానని అన్నారు. అమరావతే రాజధానిగా ఉంటుందని, అది మారడానికి వీల్లేదని కేంద్రం నిర్ణయించినట్టుగా ప్రతిపక్ష నేతలు చెబుతుండటాన్ని అమాయక వ్యాఖ్యలో, మోసపూరిత వ్యాఖ్యలో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. రాజధాని అంశంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా గానీ కేంద్రం జోక్యం చేసుకోదని స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ప్రతిపక్ష నేతలు వక్రీకరించి మాట్లాడుతున్నారని విమర్శించారు.