నేను చేసిన విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రకటన చేసింది: విజయసాయిరెడ్డి
- కేపీ ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తేయాలని రాజ్యసభలో కోరాను
- నిషేధం కారణంగా వేలాది రైతులు ఆవేదన చెందుతున్నారని చెప్పాను
- థ్యాంక్యూ పీయూష్ గోయల్ జీ.. సానుకూలంగా స్పందించారు
అనంతరం విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేసి... 'థ్యాంక్యూ పీయూష్ గోయల్ జీ.. రాజ్యసభలో నేను ఈ రోజు చేసిన విజ్ఞప్తికి వెంటనే సానుకూలంగా స్పందించారు. ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని రెండు రోజుల్లో ఎత్తేస్తామని చెప్పినందుకు సంతోషం. మీరు చేసిన ఈ ప్రకటన రైతులకు ఉపశమనం కలిగిస్తుంది' అని అన్నారు.