జగన్ గారిని మళ్లీ జైలుకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.. రెడీగా ఉండండి: బుద్ధా వెంకన్న కీలక వ్యాఖ్యలు

  • అడ్డమైన పనులు చేసి 16 నెలలు చిప్ప కూడు తిన్నారు 
  • మా రాజకీయ జీవితాలకు తెరపడే రోజులు వచ్చాయంటున్నారు
  • అంత ధైర్యం వచ్చిందా?
  • అంత వరకూ వచ్చాకా మేము మాత్రం చూస్తూ కూర్చుంటామా?  
ఇన్‌సైడర్ ట్రేడింగ్ బండారం బయట పడేటప్పటికి ఎలాగూ జైలుకు పోయేదేకదా అని పిచ్చి కూతలు కూస్తున్నారని, టీడీపీ నేతల రాజకీయ జీవితాలకు తెరపడే రోజులు వచ్చాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన విమర్శలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు.

'వైఎస్ జగన్ గారు, మీరు కలిసి మొదలుపెట్టిన మూడు రాజధానుల దందా వెనుక ఉన్న అసలు రహస్యాలు తెలిసి అధికారులు పారిపోతున్నారు. ముందు వారిని ఆపే మార్గం చూడండి విజయసాయిరెడ్డి గారు' అని బుద్ధా వెంకన్న అన్నారు.
 
'అడ్డమైన పనులు చేసి 16 నెలలు చిప్ప కూడు తిన్న నీకు మా రాజకీయ జీవితాలకు తెరపడే రోజులు వచ్చాయి అనే అంత ధైర్యం వచ్చిందా? అంత వరకూ వచ్చాకా మేము మాత్రం చూస్తూ కూర్చుంటామా? మిమల్ని, మీ జగన్ గారిని మళ్లీ జైలుకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. రెడీగా ఉండండి' అని ట్వీట్ చేశారు.

'పాత తప్పులు,ఇప్పుడు మూడు రాజధానుల పేరుతో వైజాగ్ లో చేస్తున్న భూముల దందా అంతా బయటపడుతుంది మీరు, మీ పరివారం ఊచలు లెక్కపెట్టడం ఖాయం సాయి రెడ్డి గారు' అని అన్నారు.

Go Back to Shorts
Budda venkanna
Telugudesam
Jagan
YSRCP

More Telugu News