కేంద్రమంత్రి పియూష్ గోయల్ ను కలిసిన వైసీపీ ఎంపీలు

  • కేంద్రమంత్రితో భేటీ అయిన అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, రంగయ్య, రెడ్డెప్ప
  • కృష్ణాపురం ఉల్లి ఎగుమతికి అనుమతించాలని విజ్ఞప్తి
  • నవంబరు నుంచి రైతులు ఎగుమతి కోసం ఎదురుచూస్తున్నారని వెల్లడి
వైసీపీ ఎంపీలు అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, రంగయ్య, రెడ్డెప్ప ఢిల్లీలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ ను కలిశారు. కృష్ణాపురం ఉల్లి ఎగుమతికి అనుమతించాలని వారు కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ, కృష్ణాపురం ఉల్లి రైతుల సమస్యలను కేంద్రమంత్రికి వివరించామని తెలిపారు. ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరామని చెప్పారు. గతేడాది నవంబరు నుంచి ఎగుమతి కోసం రైతులు ఎదురుచూస్తున్నారని, కృష్ణాపురం ఉల్లి ఎగుమతికి అనుమతించాలని సీఎం కూడా లేఖ రాశారని అవినాష్ రెడ్డి వెల్లడించారు. తమ వినతిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని, త్వరలోనే ఎగుమతికి అనుమతి ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
Go Back to Shorts
YSRCP
MP's
Piyush Goyal
BJP
Minister
Krishnapuram Onions

More Telugu News