మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్లు
- టీడీపీ నేత గణేశ్ గుప్త కూడా టీఆర్ఎస్ లో చేరిక
- గుప్త సహా 8 మంది కౌన్సిలర్లను అభినందించిన కేటీఆర్
- ఏ ఎన్నికలు అయినా ‘కారు’దే హవా
అనంతరం, కేటీఆర్ మాట్లాడుతూ, ఏ ఎన్నికలు అయినా ‘కారు’దే హవా అని అన్నారు. ఏ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచినా కాంగ్రెస్, బీజేపీలకు విమర్శించడం అలవాటైపోయిందని విమర్శించారు. ఈవీఎంలను ఏదో చేశారు కనుకనే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచిందని విమర్శించారని, ఆ తర్వాత జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికలు, మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిందని, ఇప్పుడు ఆరోపణలు చేసేందుకు ఏమీ లేకపోవడంతో నోరెల్లబెడుతున్నారని ఆ రెండు పార్టీల నాయకులపై విమర్శలు చేశారు. కాంగ్రెస్, బీజేపీలు తమ సిద్ధాంతాలను పక్కనబెట్టి మున్సిపల్ ఎన్నికల్లో కుమ్మక్కయ్యాయని విమర్శించారు. సీఎం కేసీఆర్ పై ప్రజలకు నమ్మకం కుదిరిందని, అందుకే, ఏ ఎన్నికలో అయినా తమ పార్టీ గెలుస్తోందని అన్నారు.